- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
సేతు సముద్రం ప్రాజెక్టు పునరుద్ధరణకు తీర్మానం

చెన్నై: తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. సేతు సముద్రం ప్రాజెక్టును వెంటనే అమలు చేయాలని గురువారం ఎంకే స్టాలిన్ అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ మేరకు సేతు సముద్రం ఛానల్ ప్రాజెక్టును పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించింది. తమిళనాడు ఆర్థికాభివృద్ధిని, భారతదేశ ఆర్థికాభివృద్ధిని పటిష్టం చేసేందుకు సేతు సముద్రం ప్రాజెక్టు చాలా ముఖ్యమైనదిగా నిపుణులు పేర్కొంటున్నారు.
సేతు సముద్రం ప్రాజెక్ట్ కింద, మన్నార్‌ను పాక్ జలసంధితో కలిపే 83 కిలోమీటర్ల పొడవున నీటి కాలువను రూపొందించాల్సి ఉంది. అయితే ఈ మార్గం పురాణ చరిత్రను కలిగి ఉందని పేర్కొంటూ పలు రాజకీయ పార్టీలు, పర్యావరణవేత్తలు, కొన్ని హిందూ సంఘాల నుండి వ్యతిరేక ఎదురవుతోంది. ఈ ప్రాజెక్టు అమల్లోకి వస్తే 50 వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని సీఎం చెప్పారు. రాజకీయ కారణాలతో కేంద్రంలోని బీజేపీ దీనిని ఆలస్యం చేస్తూ వచ్చిందని ఆరోపించారు.
అంతకుముందు దీనికి ఎన్డీఏ ప్రభుత్వంలోని ప్రధాని వాజపేయ్ ఫీజిబిలిటీ పరిశోధనలకు అనుమతి ఇవ్వడం గమనార్హం. ఆ తర్వాత అదే ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు నిలిపివేసింది. మరోవైపు తాజాగా తీర్మానానికి రాష్ట్ర బీజేపీ నేత నైనర్ నాగేంద్రన్ మద్దతు ఇవ్వడం గమనార్హం. రామసేతుకు ఎలాంటి నష్టం కలిగించకుండా ప్రాజెక్టును అమలు చేయాలని ఉద్ఘాటించారు. మరోవైపు బీజేపీ నేత సుబ్రహ్మణ్యం స్వామి రామసేతును జాతీయ చారిత్రక వారసత్వ చిహ్నంగా ప్రకటించాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై వచ్చే నెలలో విచారణ చేపట్టనుంది.