యూఎస్‌లో టిక్ టాక్ నిషేధం.. యాప్ స్టోర్ల నుంచి మాయం

by John Kora |
యూఎస్‌లో టిక్ టాక్ నిషేధం.. యాప్ స్టోర్ల నుంచి మాయం
X

- శనివారం రాత్రే తొలగించిన సంస్థ

- నిషేధం తొలగింపుకు లాబీయింగ్?

- 90 రోజుల సమయం ఇస్తానన్న ట్రంప్

దిశ, నేషనల్ బ్యూరో:

అమెరికాలో టిక్ టాక్‌పై నిషేధం అమలులోకి వచ్చింది. అమెరికా ఫెడరల్ లా విధించిన నిషేధం ఆదివారం నుంచి అమలులోకి రానుండటంతో ఈ యాప్‌ను యాపిల్, గూగుల్ స్టోర్ల నుంచి శనివారం రాత్రే తొలగించారు. టిక్ టాక్‌ను అమెరికాలో డౌన్ లోడ్ చేసుకోవడానికి అందుబాటులో లేకుండా పోయింది. అలాగే ఇప్పటికే డౌన్ లోడ్ చేసిన వాళ్లు ఉపయోగించలేరు. టిక్ టాక్‌ను అమెరికా కంపనీలకు అమ్మాలని, లేకపోతే నిషేధం విధిస్తామని గతంలోనే ఫెడరల్ లా తెలిపింది. దీంతో నిషేధానికి ఒక రోజు ముందే బైట్ డ్యాన్స్ కంపెనీ టిక్ టాక్ సేవలను ఆపేసింది.

శనివారం రాత్రి నుంచి టిక్ టాక్‌ను వాడటానికి ప్రయత్నించగా 'టెంపరరీ అన్‌అవెయిలబుల్'అనే పాపప్ మెసేజ్ వస్తోంది. అంతే కాకుండా'అమెరికాలో టిక్ టాక్ వాడకుండా చట్టం చేయబడింది. అందుకే ప్రస్తుతం మీరు టిక్ టాక్‌ను ఉపయోగించలేదు. అధ్యక్షుడు ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మాతో కలిసి ఈ సమస్యను పరిష్కరించడానికి కలిసి పని చేస్తానని చెప్పడం మా అదృష్టం. ప్లీజ్ స్టే ట్యూన్డ్' అనే సందేశం కనిపిస్తోంది.

అనేక న్యాయ పోరాటాల తర్వాత కూడా టిక్ టాక్‌పై నిషేధాన్ని అమలు చేయడానికి యూఎస్ సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. దేశ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఎస్ ఫెడరల్ లా చెబుతోంది. టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్.. ఈ యాప్‌ను చైనాకు చెందిన వారికి తప్ప ఎవరికైనా అమ్మాలని లేకపోతే నిషేధం ఎదుర్కోవాలని హెచ్చరించింది. అయితే టిక్ టాక్‌ పట్ల కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకూలంగా ఉన్నారు. తన గెలుపులో భాగస్వామ్యులైన యువ ఓటర్లను కలపడానికి టిక్ టాక్ ఉపయోగపడిందని ఆయన భావిస్తున్నారు. తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత టిక్ టాక్‌కు 90 రోజుల గడువు ఇస్తానని కూడా గతంలో వ్యాఖ్యానించారు.

కాగా బైట్ డ్యాన్స్ సీఈవో షౌ చ్యూ నిషేధం ఎత్తివేతకు మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ విషయంలో ఆయన ట్రంప్ సహాయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. సోమవారం జరుగనున్న ట్రంప్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి కూడా షౌ చ్యూ పాల్గొనే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ ఆమోదించిన ఈ నిషేధిత చట్టాన్ని తొలగించడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. కాగా, టిక్ టాప్‌పై నిషేధంతో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ మార్కెట్ షేర్ గణనీయంగా పెరగనున్నది.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed