- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
27 ఏళ్ల క్రితం అదృశ్యమైన వ్యక్తి.. మహాకుంభమేళలో భర్తను అలా గుర్తు పట్టిన భార్య!

దిశ,వెబ్‌డెస్క్:ఉత్తరప్రదేశ్(UttarPradesh)లోని ప్రయాగరాజ్(Prayagraj)లో మహా కుంభమేళ కోలాహలంగా జరుగుతోంది. ఈ మహా కుంభమేళా(Mahakumbamela)కు ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో.. యోగులు, స్వాములు, సాధువులు, అఘోరా(Aghora)లు వస్తున్నారు. ఈ క్రమంలో భక్తుల రద్దీ నెలకొంటుంది. ఈ క్రమంలో త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కోట్లలో భక్త జనం దర్శనమిస్తున్న ఈ మహాకుంభమేళలో భక్తులు తప్పిపోకుండా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇలా అధిక జనసమూహం ఉన్న చోట మనుషులు తప్పిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అయితే 27 ఏళ్ల క్రితం తప్పిపోయిన ఓ వ్యక్తి కుంభమేళాలో కనిపించడం ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఝార్ఖండ్‌కు చెందిన గంగాసాగర్ యాదవ్ అనే వ్యక్తి 1998లో ఉన్నట్టుండి అదృశ్యమయ్యాడు.
అతనికి భార్య ధన్వా దేవి, కుమారులు కమలేశ్, విమలేశ్ ఉన్నారు. అయితే భర్త కనిపించకపోయేసరికి ఆందోళన చెందిన భార్య అతని కోసం పలు ప్రాంతాల్లో వెతకడం ప్రారంభించింది. కానీ లాభం లేకుండా పోయింది. భర్త ఆచూకీ ఎక్కడ కనిపించకపోయే సరికి ఆమె తీవ్రమైన ఆవేదనకు గురైంది. కొన్ని నెలలు అతను వస్తాడనే ఎదురు చూస్తుంది. తన భర్త రాకపోయే సరికి ఇక చేసేదేమి లేక.. గంగా సాగర్‌పై ఆశలు వదులుకున్న భార్య, తన పిల్లలను కష్టపడి పెంచి పెద్ద చేసింది. తాజాగా ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు ధన్వాదేవి కుటుంబం హాజరైంది. ఈ క్రమంలో వారికి ఒక అఘోరి కనిపించారు. అతన్ని చూసి వారు షాక్ అయ్యారు. ఆ అఘోరి గంగాసాగర్లా కనిపించడంతో వెంటనే ఫొటో తీసిన కుటుంబికులు ధన్వా దేవికి పంపించారు.
ఫొటో చూడగానే భర్తను గుర్తించిన ధన్వాదేవి తన పిల్లలు, కుటుంబ సభ్యులతో అక్కడికి చేరుకుంది. నుదిటిపై మచ్చ, ఎత్తు పళ్ళు, మోకాలిపై దెబ్బలు చూసి తన భర్తను గుర్తించింది. దీంతో ఎంతో సంతోషంతో తమతో పాటు ఇంటికి రావాలని గంగాసాగర్‌ను కోరింది. కానీ వారిని చూసిన అఘోరి విచిత్రంగా ప్రవర్తిస్తూ.. తాను వారణాసికి చెందిన అఘోరినని చెప్పాడు. తన పేరు బాబా రాజ్ కుమార్ అని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. మీతో నాకు ఎటువంటి సంబంధం లేదని, అసలు మీరెవరు? అంటూ గంగాసాగర్ పేర్కొన్నారు. చివరికి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కుంభమేళా ముగిసే వరకు ఇక్కడే ఉంటామని, తమ భర్తకు అవసరమైతే DNA పరీక్షలు చేయిస్తామని ధన్వాదేవి తెలిపారు. డీఎన్ఏ పరీక్షలో అఘోరి గంగాసాగర్ కాదని తేలితే ఆయనకు క్షమాపణలు చెబుతామని సోదరుడు మురళి యాదవ్ పేర్కొన్నారు.
READ MORE ...
Uttar Pradesh:కుంభమేళాలో టీటీడీ ఉద్యోగి అదృశ్యం