ఆ మూవీ పై నిర్మాత సంచలన వ్యాఖ్యలు.. మోనాలిసాకు బిగ్ షాక్ తగలనుందా?

by Jakkula Mamatha |
ఆ మూవీ పై నిర్మాత సంచలన వ్యాఖ్యలు.. మోనాలిసాకు బిగ్ షాక్ తగలనుందా?
X

దిశ,వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని ప్రయోగరాజ్‌(Prayagraj)లో జరుగుతున్న మహాకుంభమేళా(Mahakumbh Mela)లో తేనెకళ్లతో అందరినీ ఆకట్టుకున్న మోనాలిసా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మధ్యప్రదేశ్‌(Madya Pradesh)లోని ఇండోర్‌(Indore)కు చెందిన మోనాలిసా(Monalisa) పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకోవడానికి కుంభమేళాకు వచ్చింది. ఈ క్రమంలో మోనాలిసాను చూసిన కొందరు యూట్యుబర్ ఇన్‌ఫ్లూయర్స్ ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి.

సోషల్ మీడియా(Social Media)లో ఎక్కడ చూసిన ఆమె ఫొటోలు, వీడియోలే దర్శనమిచ్చాయి. దీంతో ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగిన కుంభమేళా బ్యూటీ మోనాలిసాకు బాలీవుడ్ డైరెక్టర్(Bollywood Director) సనోజ్ మిశ్రా(Sanoj Mishra) సినిమాలో అవకాశం ఇచ్చారు. ఇక ఈ తేనెకళ్ల చిన్నది మోనాలిసా ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ సినిమాలో నటించనుంది. అయితే ఈ చిత్రం ప్రారంభానికి ముందే నిలిచిపోయేలా కనిపిస్తోంది.

ఎందుకంటే.. ఇటీవల మోనాలిసాతో డైరెక్టర్ సనోజ్ మిశ్రా క్లోజ్‌గా ఉండటం పై బాలీవుడ్ నిర్మాత(Bollywood producer) జితేంద్ర నారాయణ్ సింగ్(Jitendra Narayan Singh) అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో డైరెక్టర్ సనోజ్ మిశ్రాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మోనాలిసాను పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారని, ఆమెను ట్రాప్ చేస్తున్నారని, తప్పుదారి పట్టిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ‘సినిమా అవకాశాలిస్తానని అమ్మాయిలను ముంబైకి తీసుకెళ్లి అనుచితంగా ప్రవర్తిస్తాడు. అతని ఒక్క సినిమా విడుదల కాలేదు’ అని నిర్మాత జితేంద్ర పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో నిర్మాత జితేంద్ర నారాయణ్ సింగ్(Jitendra Narayan Singh) చేసిన వ్యాఖ్యలపై డైరెక్టర్ సనోజ్ మిశ్రా తీవ్రంగా ఖండించారు. ఆయన స్పందిస్తూ.. మోనాలిసా నా కూతురు లాంటిది. నేను ఆమెను వేధించడం లేదు. మోనాలిసా ఇష్టపూర్వకంగానే నటనపై ట్రైనింగ్ ఇప్పిస్తున్నాను. ఆమె ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నేనే యాక్టింగ్ నేర్పిస్తున్నాను. ఇది తప్పుదోవ పట్టించడం కాదని స్పష్టం చేశారు. ట్రైనింగ్ పూర్తవ్వగానే సినిమా(Movie)లో అవకాశం ఇస్తానని సనోజ్ మిశ్రా వెల్లడించారు.

Next Story

Most Viewed