ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరో షాక్.. జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు..

by Disha Web Desk 12 |
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరో షాక్.. జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు..
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. కాగా ఈ రోజు ఆయన కస్టడీకి కోర్టు 14 రోజులు పొడిగించింది. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. మే 7వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్‌ను కోర్టు ముందు హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ మే 7 వరకు కొనసాగనుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో ‘కీలక కుట్రదారు’ అన్న ఆరోపణలపై మార్చి 21న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా గత కొద్ది రోజులుగా తీహార్ జైలులోనే ఉన్న సీఎం కేజ్రీవాల్ షుగర్ లెవల్స్(320) భారీగా పెరిగిపోయాయి. దీంతో అతనికి ఇన్సులిన్ ఇంజక్షన్ అవసరమని ఆప్ ఎంపీలు పలుమార్లు జైలు అధికారుల వద్దకు వెళ్లగా.. పర్మీషన్ లభించలేదు. కానీ తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కేజ్రీవాల్ కు ఇన్సులిన్ అందించడానికి పర్మిషన్ దక్కింది. దీంతో ఢిల్లీ ప్రజల పోరాటం వల్లే ఇది సాధ్యమైందని పెర్కోన్నారు.



Next Story

Most Viewed