Thalapathy Vijay: 2026 ఎన్నికల్లో చరిత్రను తిరగరాస్తాం.. తలపతి విజయ్ సంచలన వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2025-02-26 08:38:50.0  )
Thalapathy Vijay: 2026 ఎన్నికల్లో చరిత్రను తిరగరాస్తాం.. తలపతి విజయ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) మెజారిటీ స్థానాల్లో గెలుపొంది తమిళ రాజకీయాల్లో (Tamil Politics) చరిత్రను తిరగరాస్తామని తమిళగ వెట్రి కళగం పార్టీ (Tamilaga Vetri Kalagam Party) అధ్యక్షుడు తలపతి విజయ్ (Thalapathy Vijay) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మహాబలిపురం (Mahabalipuram)లో నిర్వహించిన టీవీకే పార్టీ (TVK Party) మహానాడు (Mahaanadu)ను అట్టహాసంగా నిర్వహించారు. ఈ బహిరంగ సభకు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashanth Kishore) కూడా హాజరకావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా సభలో తలపతి విజయ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2026లో రాబోయే సాధారణ ఎన్నికల్లో ఎవరు ఎన్ని కుట్రలు చేసిన గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. పెత్తందార్లు, భూస్వాములు వాళ్ల స్వార్థం కోసం రాజకీయాల్లోకి వచ్చిన ఆరాచకాలు చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రభుత్వ దౌర్జన్యాలను ప్రశ్నిస్తే.. తమ పార్టీ నేతలపై ఎక్కడికక్కడ అక్రమ కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైన గెలిచి అసెంబ్లీకి వెళ్తామని ధీమా వ్యక్తం చేశారు. తమిళగ వెట్రి కళగం పార్టీ ఎప్పుడైన సామాన్యులకే రాజ్యాధికారం కల్పిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇంత అవినీతి, అక్రమాలు జరుగుతున్నా.. కేంద్రంలోని బీజేపీ చోద్యం చూస్తోందని మండిపడ్డారు. డీఎంకే, బీజేపీ పార్టీలు లోపాయకారి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. అదేవిధంగా 1967లో తమిళ రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చాయని.. మళ్లీ 2026లోనూ అదే సీన్ రిపీట్ కాబోతోందని జోస్యం చెప్పారు. త్వరలోనే తమ పార్టీలోకి కీలక నేతల చేరికలు ఉంటాయని తలపతి విజయ్ అన్నారు.


Also Read...

అవినీతి పరులందరినీ డీఎంకే సభ్యత్వం ఇచ్చి పార్టీలో చేర్చుకుంది: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా

Next Story

Most Viewed