ఎయిర్‌ఫోర్స్‌లో ఒకే రోజు ఇద్దరు బాధ్యతల స్వీకరణ

by Harish |
ఎయిర్‌ఫోర్స్‌లో ఒకే రోజు ఇద్దరు బాధ్యతల స్వీకరణ
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ వైమానిక దళం(ఎయిర్‌ఫోర్స్) డిప్యూటీ చీఫ్‌గా ఎయిర్ మార్షల్ తేజిందర్ సింగ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎయిర్ హెడ్ క్వార్టర్స్( వాయు భవన్ )లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం అక్కడి జాతీయ యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఈ నియామకానికి ముందు ఆయన మేఘాలయలోని షిల్లాంగ్‌లోని ఐఏఎఫ్ హెచ్‌క్యూ ఈస్టర్న్ ఎయిర్ కమాండ్‌లో సీనియర్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్‌గా ఉన్నారు.

నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి అయిన తేజిందర్ సింగ్ 1987లో భారత వైమానిక దళం ఫైటర్ విభాగంలో చేరారు. ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా 2007లో వాయు సేన పతకం, 2022లో భారత రాష్ట్రపతిచే అతి విశిష్ట సేవా పతకాన్ని అందుకున్నారు. వివిధ రకాల విమానాలపై 4,500గంటల కంటే ఎక్కువ ప్రయాణించిన అనుభవంతో 'ఎ' క్యాటగిరీ క్వాలిఫైడర్‌ గురువుగా ఉన్నారు. ఆయన ఒక ఫైటర్ స్క్వాడ్రన్, అలాగే, జమ్మూ కాశ్మీర్ కమాండింగ్ ఎయిర్ ఆఫీసర్ కూడా.

మరోవైపు.. సెంట్రల్ ఎయిర్ కమాండ్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ బాధ్యతలు స్వీకరించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రకటనలో పేర్కొంది. ఈయన 1986లో ఐఏఎఫ్ ఫైటర్ విభాగంలో చేరారు. 3,300 గంటల కంటే ఎక్కువ విమాన ప్రయాణాలు చేసిన అనుభవం ఉంది. శనివారం పదవీ విరమణ చేసిన ఎయిర్ మార్షల్ ఆర్‌జీకే కపూర్ తర్వాత ఆయన బాధ్యతలు స్వీకరించారు.

Advertisement

Next Story

Most Viewed