- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లోక్‌సభ ఎన్నికలకు ముందు యూట్యూబ్‌లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో:లోక్‌సభ ఎన్నికలకు ముందు యూట్యూబ్‌లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలకు ముందు యూట్యూబ్‌లో ఆరోపణలు చేసే ప్రతి ఒక్కరినీ కటకటాల వెనక్కి నెట్టడం ప్రారంభిస్తే ఎంతమందికి జైలు శిక్ష పడుతుందో ఊహించండి? అంటూ కామెంట్ చేసింది. తమిళనాడులో 'సత్తాయ్' అనే యూట్యూబ్ చానెల్ హోస్ట్ దురైమురుగన్ బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. దురైమురుగన్ బెయిల్ పిటిషన్ పై ఇవాళ స్టిస్‌లు అభయ్ ఎస్ ఓకా, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా యూట్యూబర్‌కు మంజూరైన బెయిల్‌ను పునరుద్ధరించగా విచారణ సందర్భంగా రాష్ట్రం తరపున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని ఉద్దేశించి జస్టిస్ ఓకా ఒక కీలకమైన ప్రశ్నను లేవనెత్తారు. ఎన్నికలకు ముందు, మేము యూట్యూబ్‌లో ఆరోపణలు చేసే ప్రతి ఒక్కరినీ కటకటాల వెనక్కి నెట్టడం ప్రారంభిస్తే, ఎంతమందికి జైలు శిక్ష పడుతుందో ఊహించండి? అంటూ వ్యాఖ్యానించారు.కాగా దురైమురుగన్ గతంలో తమిళనాడు సీఎం స్టాలిన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్ పై బయటకు రాగా మద్రాస్ హైకోర్టు అతడి బెయిల్ ను రద్దు చేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా విచారణ జరిపిన కోర్టు ఆయనకు బెయిల్ పునరుద్దరించింది.