Supreme Court: ప్రమోషన్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు.. అలా చేస్తే ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే..

by Shiva |
Supreme Court: ప్రమోషన్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు.. అలా చేస్తే ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలో సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. రూల్ బుక్ ప్రకారం ఉద్యోగికి ఉన్న అర్హతలకు లోబడి మాత్రమే ప్రమోషన్లు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఒకవేళ ఉన్నత పదవికి అప్‌గ్రేడేషన్ కోసం ఉద్యోగిని సంబంధిత అథారిటీ పరిగణలోకి తీసుకోని పక్షంలో వారి ప్రాథమిక హక్కును ఉల్లంఘించినట్లేని హిమా కోహ్లీ, అహ్సానుద్దీన్ అమానుల్లా ద్విసభ్య ధర్మాసనం వెల్లడించింది. పదోన్నతి కోసం పరిగణించబడే హక్కును న్యాయస్థానాలు కేవలం చట్టబద్ధమైన హక్కుగా చూడటమే కాకుండా ప్రాథమిక హక్కుగా పరిగణిస్తున్నాయని కోర్టు తెలిపింది. కాగా, బీహార్ ఎలక్ట్రిసిటీ బోర్టు ఉద్యోగి కేసు విషయంలో సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.



Next Story