- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'బీసీ ఉపకులాల కేటగిరి మార్పుపై అధ్యయనం చేయండి'
దిశ, డైనమిక్ బ్యూరో: బీసీ ఉపకులాల్లో కేటగిరి మార్పు వ్యవహరంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అధ్యయనం చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల బీసీ కమిషన్‌లను మంగళవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. 2009లో బీసీ-డి కేటగిరీలో ఉన్న ముదిరాజ్‌లను బీసీ-ఏ లోకి మార్చుతూ అప్పటి ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన జీఓపై జాతీయ మత్య్సకారుల సంఘం రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. విచారణ అనంతరం ఆ జీఓను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై 2010లో ముదిరాజ్ సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ముదిరాజ్ సంఘం దాఖలు చేసిన పిటిషన్ లో తమ వాదనలు కూడా విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలంటూ పలు కుల సంఘాలు పిటిషన్లు దాఖలు చేశాయి.
ఈ నేపథ్యంలో 2010లో దాఖలైన పిటిషన్లపై ఇవాళ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ బేలా ఎం.త్రివేది త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ వ్యవహరంపై దాఖలైన పిటిషన్లపై రెండు రాష్ట్రాల బీసీ కమిషన్లకు పలు సూచనలు జారీ చేసింది. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం అన్ని కులాల నిష్పత్తిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని ఇరు రాష్ట్రాల బీసీ కమిషన్‌లను ఆదేశించించింది. అలాగే జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ల అమలు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని పేర్కొంది. బీసీ-డి కేటగిరీలో ఉన్న కులాలను బీసీ-ఏ కి మార్చడం వల్ల వచ్చే లాభనష్టాలు ఏమిటి? రిజర్వేషన్లు అమలు సాధ్యాసాధ్యాలు, కేటగిరీల మార్పులపై వీలైనంత త్వరగా స్పష్టమైన అధ్యయనం చేసి ఒక నివేదిక తయారు చేయాలని, ఆ తర్వాతే.. అమలుకు అవసరం అయిన చర్యలు తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఆదేశిస్తూ విచారణ ముగించింది.