Supreme Court: తిరుమల లడ్డూ కల్తీపై నేడు సుప్రీం కోర్టులో విచారణ.. తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

by Shiva |   ( Updated:2024-10-04 05:49:08.0  )
Supreme Court: తిరుమల లడ్డూ కల్తీపై నేడు సుప్రీం కోర్టులో విచారణ.. తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల (Tirumala) శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు ఆనవాళ్లు ఉన్న నెయ్యిని వాడారనే వార్త దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. స్వయంగా సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) చూపించిన ల్యాబ్ రిపోర్ట్స్‌ (Lab Reports) వివాదాలకు కేంద్ర బిందువుగా మారాయి. కోట్లాది మంది ఆరాధ్య దైవమైన శ్రీనివాసుడి తిరుమల (Tirumala) లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే విషయంపై భక్తులు ఓ రేంజ్‌లో మండి పడుతున్నారు. ఇంతటి దురాగతానికి పాల్పడిన భాధ్యులను కఠినంగా శిక్షించాలని సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు, పలువురు రాజకీయ నాయకులు సోషల్ మీడియా (Social Media) వేదికగా డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తిరుమల (Tirumala) లడ్డూ కల్తీ వ్యవహరంపై విచారణ చేపట్టి నిజానిజాలు వెలికి తీయాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి (Subramanya Swamy), వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Redd), ఇతరులు సుప్రీం కోర్టులో (Supreme Court) పిటిషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు గురువారం ఆ పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. తిరుమల లడ్డూ వివాదంపై దర్యాప్తునకు సంబంధించి కేంద్రం వైఖరి చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా (Solicitor General Tushar Mehta)ను కోరింది. దీంతో ఆయన అభిప్రాయాన్ని తెలిపేందుకు సొలిసిటర్ జనరల్ సమయం కోరారు. దీంతో కోర్టు విచారణను శుక్రవారం ఉదయం 10.30కి వాయిదా వేసింది. అయితే, కేసు విచారణలో సిట్ దర్యాప్తును కొనసాగించాలా.. కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలా అన్న విషయంపై ధర్మాసనం తీర్పును వెలువరించబోతున్న తరుణంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed