- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిల్కిస్ బానో కేసులో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం
దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో కేసులో దోషులను గడువుకు ముందే విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు బుధవారం సంచలన నిర్ణయం తీసుకుంది. కేసు విచారణకు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. 2000 గుజరాత్ అల్లర్లలో సామూహిక అత్యాచారానికి గురై, ఏడుగురు కుటుంబ సభ్యులను కోల్పోయిన బిల్కిస్ బానో సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ వేశారు. అత్యాచార కేసులో 11 మంది దోషులను గడువుకు ముందే బీజేపీ సారథ్యంలోని గుజరాత్ ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 15న విడుదల చేసింది. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో బిల్కిస్ బానో సవాలు చేశారు.
సుప్రీంకోర్టు నిర్దేశించిన చట్టపరమైన విధివిధాలను రాష్ట్ర ప్రభుత్వ పూర్తికా నిర్లక్ష్యం చేసి, యాంత్రికంగా దోషుల విడుదలకు ఆదేశాలిచ్చిందని తన పిటిషన్‌లో బిల్కిస్‌బానో కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. యావజ్జీవ శిక్ష పడిన దోషులను ముందస్తుగా విడిచిపెట్టడం తప్పుడు సంకేతాలకు తావిచ్చిందని అన్నారు. గోద్రా రైలును ఆందోళనకారులు తగులబెట్టిన అనంతరం చెలరేగిన అల్లర్లలో బిల్కిన్ బానో అత్యాచారానికి గురైంది. అప్పట్లో 21 ఏళ్ల వయస్సున్న ఆమె ఐదు నెలల గర్భవతి కూడా. బిల్సిస్ బానో కుటుంబ సభ్యులు ఏడుగురు ఊచకోతకు గురయ్యారు.
వారిలో ముడేళ్ల ఆమె కూతురు కూడా ఉంది. ఈ కేసును సీబీఐ చేపట్టగా, తుదుపరి విచారణను మహారాష్ట్ర కోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. 2008 జనవరి 21న సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ కేసులో 11మందిని దోషులుగా నిర్ధారిస్తూ, యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పును ఆ తర్వాత ముంబై హైకోర్టు, సుప్రీంకోర్టు ధ్రువీకరించాయి. జైలులో సత్ప్రవర్తన పేరుతో గుజరాత్ ప్రభుత్వం దోషుల విడుదలకు అనుమతించడంతో గోద్రా సబ్ జైలు నుంచి గత ఏడాది ఆగస్టు 15న వీరంతా విడుదలయ్యారు.