కోవిషీల్డ్ ఆందోళనలపై విచారణకు పిటిషన్‌ను అంగీకరించిన సుప్రీంకోర్టు

by S Gopi |
కోవిషీల్డ్ ఆందోళనలపై విచారణకు పిటిషన్‌ను అంగీకరించిన సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: బ్రిటీష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్‌ కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్‌పై ఆందోళణలు పెరిగాయి. ఈ క్రమంలో దీని గురించి విచారణ చేపట్టాలని దాఖలైన పిటిషన్‌ను భారత అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. దేశీయంగా ఈ వ్యాక్సిన్‌ను సీరమ్ ఇన్‌స్టిట్యూట్ తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. విచారణకు తేదీని నిర్ణయించలేదు, అయితే ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఈ విచారణకు అంగీకరించారు. ఈ వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై దర్యాప్తు చేయడానికి నిపుణుల బృందం, ఔషధం తీసుకున్న తర్వాత మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించాలనే డిమాండ్లను కలిగి ఉంది. ఇదే సమయంలో పిటిషన్‌పై ముందస్తు విచారణను సీజేఐ తోసిపుచ్చారు. ప్రత్యేకించి, పిటిషనర్ సైడ్-ఎఫెక్ట్, ఇతర ప్రమాదాలు రెండింటినీ పరిశోధించాలని, ఈ దర్యాప్తును రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షించాలని నిపుణుల ప్యానెల్‌ను డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ తీసుకున్న కొందరు వికలాంగులుగా మారారని, వారికి కూడా నష్టపరిహారం అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. గత నెల ఆస్ట్రాజెనెకా తన వ్యాక్సిన్ గురించి సంచలన విషయాన్ని బహిర్గతం చేసింది. తమ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో అరుదైన సందర్భాల్లో రక్తం గడ్డ కట్టడం, తక్కువ ప్లెట్‌లెట్ కౌంట్‌కు దారితీస్తుందని వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed