- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆలయంలో రీల్స్ చేయొద్దన్న సెక్యూరిటీ గార్డులపై ఇద్దరు మహిళల దాడి

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని ప్రముఖ మహాకాళేశ్వరాలయంలో సెక్యూరిటీ గార్డులపై దాడి ఘటన వివాదంగా మారింది. ఆలయంలోని నిషేధిత ప్రాంతంలో వీడియోలు షూట్ చేయకుండా అడ్డుకున్న ముగ్గురు మహిళా సెక్యూరిటీ గార్డులను ఇద్దరు మహిళలు దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు. పోలీసు అధికారుల వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆలయ ప్రాంగణంలోని నిషేధిత ప్రాంతంలో పాలక్, పారీ అనే ఇద్దరు మహిళలు వీడియో రీల్స్ చేస్తుండటాన్ని మహిళా సెక్యూరిటీ సిబ్బంది గమనించారు. ఈ ప్రదేశంలో రీల్స్, వీడియోలు తీసుకూడదని వారు హెచ్చరించడంతో ఇద్దరు మహిళలు, మరికొందరు కలిసి వారిపై దాడి చేశారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి అజయ్ వర్మ చెప్పారు. ఓ ప్రైవేటు సెక్యూరిటీ సంస్థ తరపున శివానీ, సంధ్య, సంగీతాలు ఆలయంలో సెక్యూరిటీ గార్డులుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరిపై అకారణంగా దాడి చేసిన మహిళలు నాగ్ద పట్టడానికి చెందినవారు గుర్తించామని అజయ్ వర్మ చెప్పారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని ఆయన వెల్లడించారు.