- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Steve Jobs's wife: కుంభమేళాలో స్టీవ్ జాబ్స్ సతీమణికి అస్వస్థత
దిశ, నేషనల్ బ్యూరో: కుంభమేళాలో యాపిల్ కంపెనీ కో ఫౌండర్ స్టీవ్ జాబ్స్ (Steve Jobs) సతీమణి లారీన్ పావెల్ జాబ్స్ (Laurene Powell Jobs) అస్వస్థకు గురయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు (Maha Kumbh Mela) లారీస్ హాజరయ్యారు. అయితే, అక్కడే ఆమె అస్వస్థతకు గురైనట్లు సమాచారం. వాతావరణ మార్పుల వల్లే ఆమె అస్వస్థతకు లోనయినట్టు నిరంజనీ అఖాడాకు చెందిన మహా మండలేశ్వర్ స్వామి కైలాసానంద గిరి మహరాజ్ తెలిపారు. ప్రస్తుతం, నిరంజనీ అఖాడా ఏర్పాటు చేసిన శిబిరంలో లారీస్ చికిత్సతీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఆరోగ్యం మెరుగయ్యాక త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేస్తారని చెప్పుకొచ్చారు.ఇకపోతే, లారీస్ తన పేరుని కమలగా మార్చుకున్నట్లు ఆయన తెలిపారు. మహాకుంభ మేళాలో పాల్గొనేందుకే లారీస్ ప్రయాగ్ రాజ్ వచ్చారన్నారు. ఇప్పటికే పలు పూజకార్యాక్రమాల్లో పాల్గొన్నట్లు వెల్లడించారు. ఆమె భారత్‌లో పర్యటించడం ఇది రెండోసారి అని.. ధ్యానం చేసేందుకు ఆమె తమ ఆశ్రమానికి వచ్చి వెళ్తుంటారని పేర్కొన్నారు. పన్నెండేళ్లకు ఒకసారి జరిగే ఈ కుంభమేళా సోమవారం ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. అయితే, ఈ ఏడాది 45 కోట్లకు పైగా భక్తులు కుంభమేళాకు వస్తారని అధికారులు అంచానవేశారు. తొలిరోజే 1.65 కోట్ల మంది భక్తులు నదీజలాల్లో స్నాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది.