రెండు స్పైస్ జెట్ విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్.. కారణమిదే..!

by Sathputhe Rajesh |
రెండు స్పైస్ జెట్ విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్.. కారణమిదే..!
X

దిశ, నేషనల్ బ్యూరో : రెండు వేర్వేరు ఘటనలో స్పైస్ జెట్ (SpiceJet) విమానాలను సోమవారం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఢిల్లీ నుంచి షిల్లాంగ్ వెళ్తున్న విమానానికి పక్షి అడ్డురావడంతో విండ్ షీల్డ్‌కు పగులు వచ్చినట్లు గుర్తించారు. వెంటనే పాట్నాలోని జయప్రకాశ్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. మరో ఘటనలో చెన్నై నుంచి కొచ్చికి 117 మంది ప్రయాణికులతో వెళ్తున్న స్పైస్ జెట్ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు అధికారులు తెలిపారు. బయల్దేరిన కాసేపటికే ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో తిరిగి చెన్నైలోనే విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అధికారులు ఈ ఘటనపై స్పందిస్తూ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనంతరం ప్రయాణికులను వేరే విమానాల్లో గమ్యస్థానాలకు తరలించామన్నారు.

Advertisement

Next Story

Most Viewed