- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కాసేపట్లో మణిపూర్ నుంచి రాహుల్ న్యాయ్ యాత్ర ప్రారంభం
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ న్యాయ్ యాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది. మణిపూర్‌లోని ఖోంగ్‌జోమ్ వార్ మెమోరియల్ నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. ఇవాళ మణిపూర్‌లో ఏఐసీసీ అగ్రనేత మల్లికార్జున ఖర్గే యాత్ర జెండాను ఊపి ప్రారంభిస్తారు. ఇప్పటికే ఏఐసీసీ అగ్రనేతలు, రాహుల్ గాంధీ ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలు దేరారు. న్యాయ్ యాత్రకు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు ఉన్నారు. మరోవైపు వైఎస్ షర్మిల, మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి వెళ్లారు. న్యాయ్ యాత్ర మణిపూర్‌లో ఒక్కరోజు సాగనుంది.
నాగాలాండ్‌లో రెండు రోజులు, అస్సాంలో 8 రోజులు పాటు 17 జిల్లాల్లో 833 కిలోమీటర్లు ఉంటుంది. అనంతరం అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో ఒక్కో రోజు యాత్రను నిర్వహిస్తారు. తర్వాత బెంగాల్‌లో 5 రోజులు, బిహార్‌లో 4 రోజులు, జార్ఖండ్‌లో 8 రోజులు, ఒడిశాలో 4 రోజులు, చత్తీస్ గఢ్‌లో 5 రోజులు, ఉత్తరప్రదేశ్‌లో 11 రోజులు, మధ్యప్రదేశ్‌లో వారం పాటు యాత్ర ఉంటుంది. చివరగా రాజస్థాన్‌లో ఒక రోజు, గుజరాత్, మహారాష్ట్రలో 5 రోజుల చొప్పున యాత్ర చేపట్టనున్నారు. మార్చి 20 లేదా 21న ముంబైలో న్యాయ్ యాత్ర ముగుస్తుంది. కాగా, మొత్తంగా 67 రోజుల్లో 6700 కిలోమీటర్లు రాహుల్ పాదయాత్ర చేయనున్నారు. ఒక్క యూపీలోనే 11 రోజుల పాటు 20 జిల్లాల్లో 1074 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది.