స్లోవేకియా ప్రధాని ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు

by S Gopi |
స్లోవేకియా ప్రధాని ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు
X

దిశ, నేషనల్ బ్యూరో: దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్‌ ఫికో గురువారం కోలుకుంటున్నారని, అయితే పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రయత్నంలో భాగంగా వైద్యులు అవసరమైన అన్ని చికిత్సలను కొనసాగిస్తున్నారని ఆ దేశ రక్షణ మంత్రి రాబర్ట్ కలినాక్ బన్స్‌కా బైస్ట్రికాలోని ఆసుపత్రి ఎదుట విలేకరుల సమావేశంలో చెప్పారు. బుధవారం మధ్యాహ్నం హాండ్లోవా పట్టణంలో ఆయనపై పలుమార్లు కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం నాలుగు రౌండ్ల కాల్పులు జరిగాయి. దీంతో ఆయన కడుపులో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ను బన్‌స్కా బైస్ట్రికాలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఒక అనుమాతిడుకు పోలీసుల కస్టడీలో ఉండగా, ప్రాథమిక దర్యాప్తులో స్పష్టంగా రాజకీయ ప్రేరేపితమైన కారణాలు ఉన్నాయని మంత్రి మాటస్ సుతాజ్ ఎస్టోక్ చెప్పారు. ఇక, స్లోవేకియా ప్రధానిపై హత్యాయత్నం అనంతరం తనకు కూడా బెదిరింపులు వచ్చాయని పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ గురువారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన భద్రతను మరింత పెంచినట్టు స్థానిక మీడియా నివేదించింది.

Advertisement

Next Story

Most Viewed