Turkey: టర్కీలో బస్సు ప్రమాదంలో ఆరుగురు మృతి.. 25 మందికి గాయాలు

by S Gopi |
Turkey: టర్కీలో బస్సు ప్రమాదంలో ఆరుగురు మృతి.. 25 మందికి గాయాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: టర్కీలోని సెంట్రల్ ప్రావిన్స్ అక్సరయ్‌లో బస్సు బోల్తా పడిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు. శుక్రవారం జపాన్ పర్యాటకులతో వెళ్తున్న సమయంలో టర్కీలోని అంకారాకు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న అఫియోంకరహిసార్ ప్రావిన్స్‌లోని హైవేపై జరిగిన ఈ ప్రమాదంలో 25 మందికి పైగా గాయపడ్డారు. ఈ సంఘటన జరగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అక్సరయ్‌ గవర్నర్ మెహనత్ అలీ మీడియాతో చెప్పారు. పశ్చిమ ప్రావిన్స్‌లోని బాలికేసిర్ నుంచి టర్కీలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన కప్పడోసియాకు బస్సు ప్రయాణిస్తోందని ఆయన తెలిపారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై దర్యాప్తుకు ఆదేశించినట్టు గవర్నర్ వెల్లడించారు. గతేడాది సెప్టెంబర్‌లో సైతం టర్కీలో ఇదే విధమైన ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం మెర్జిఫోన్ పట్టణానికి సమీపంలో బోల్తాపడింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 35 మంది గాయపడ్డారు.

Advertisement

Next Story