Sikkim: సిక్కింలో కొండచరియలు విరిగిపడి నేలమట్టమైన పవర్ స్టేషన్

by S Gopi |
Sikkim: సిక్కింలో కొండచరియలు విరిగిపడి నేలమట్టమైన పవర్ స్టేషన్
X

దిశ, నేషనల్ బ్యూరో: సిక్కిం రాష్ట్రంలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్న ఘటనలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని బలూతార్‌లో ఉన్న నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌(ఎన్‌హెచ్‌పీసీ) నిర్వహిస్తున్న 510 మెగావాట్ల తీస్తా స్టేజ్ 5 డ్యామ్ పవర్ స్టేషన్ ద్వంసమైంది. పవర్ స్టేషన్‌కు ఆనుకుని ఉన్న కొండ అనేక వారాలుగా ముప్పును కలిగి ఉంది. కొద్దికొద్దిగా కొండ జారిపోతూ ఉంది. మంగళవారం భారీ వర్షాల కారణంగా కొండ ప్రధాన భాగం జారిపడి పవర్ స్టేషన్‌ను ద్వంసం చేసింది. ఈ ప్రమాదం జరిగే సమయంలో స్టేషన్‌లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. రెండు రోజుల క్రితమే పవర్ స్టేషన్‌ను ఖాళీ చేశారు. కొండచరియలు విరిగిపడుతున్న సమయంలో సమీపంలో పనిచేస్తున్న కార్మికులు పవర్ స్టేషన్ ద్వంసం అవుతున్న దృశ్యాలను తమ ఫోన్‌లలో రికార్డ్ చేశారు. పవర్ స్టేషన్‌కు చెందిన భవనం సగ భాగం పూర్తిగా నేలమట్టమైంది. ఆస్తి నష్టానికి సంబంధించి అంచనా వేస్తున్న అధికారులు తెలిపారు. వరద ఉధృతికి ద్వంసమైన ఆనకట్ట పునర్నిర్మాణం జరుగుతోందని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed