Sidda ramaiah: రాజీనామా చేసే ప్రసక్తే లేదు.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

by vinod kumar |
Sidda ramaiah: రాజీనామా చేసే ప్రసక్తే లేదు.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
X

దిశ, నేషనల్ బ్యూరో: మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూ కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరోసారి స్పందించారు. తన పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నేను మనస్సాక్షి ప్రకారం మాత్రమే పనిచేస్తానని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో రిజైన్ చేయాల్సిన పని లేదన్నారు. ఈడీ, ఇతర సంస్థల దర్యాప్తుతో సంబంధం లేకుండా, సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించాలని తెలిపారు. ‘బీఎస్‌ యడ్యూరప్ప కేసు. నాది వేర్వేరు కేసులు. ఆయన భూమి డీనోటిఫికేషన్‌ చేశారు. అందులో నాకు సంబంధం లేదు. ఈడీ, మరేదైనా సంస్థ విచారణ జరిపినా న్యాయపరంగా పోరాడుతాను’ అని వ్యాఖ్యానించారు.

వివాదం రాజకీయ ఘర్షణకు దారితీసిందని, మనీలాండరింగ్ ఆరోపణలకు తన కేసుతో సంబంధం లేదని తేల్చిచెప్పారు.14 ఫ్లాట్లను వదులుకోవాలని సిద్ధరామయ్య భార్య ముడాకు లేఖ రాయడంపై స్పందిస్తూ.. ఆ భూమిని నా భార్య సోదరుడు ఆమెకు బహుమతిగా ఇచ్చాడని ముడా దానిని ఆక్రమిస్తే, దీనికి ప్రత్యామ్నాయ స్థలం కావాలని కోరినట్టు తెలిపారు. కాగా, ముడా కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేయాలనే వైఖరిని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హోంమంత్రి జీ పరమేశ్వర తమ స్పష్టమైన వైఖరి తెలియజేశారని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర అంతకుముందు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే దీనిపై సిద్ధరామయ్య క్లారిటీ ఇచ్చారు.

Next Story

Most Viewed