- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
షాకింగ్: కేజీ దొండకాయలు రూ.900. ఎక్కడో తెలుసా?

దిశ, వెబ్‌డెస్క్: ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు చదువు, ఉద్యోగం రీత్యా విదేశాల్లోకి వెళ్లి అక్కడే స్థిరపడిపోతున్నారు. విదేశాలకు ఖర్చులకు, ఇక్కడి ఖర్చులకు చాలా తేడా ఉంటుంది. దుస్తులు, ఫుడ్, వైద్యం అన్నింటికీ ఖరీదు ఎక్కువగానే ఉంటుంది. అయితే లండన్‌లో సెటిల్ అయిన ఓంకార్ ఖండేకర్ అనే ఓ భారతీయ యువకుడు అక్కడ కూరగాయలు కొనడానికని వెళ్లి.. వాటి రేటు చూసి షాక్ తిన్నాడు.
కామన్‌గా దొండకాయ ధర కేజీ 30-60 రూపాయల వరకు ఉంటుందేమో కదా. మరీ లండన్‌లో ఎంతో తెలుసా..? కేజీ దొండకాయ 900 రూపయలు. ఒక కిలో దొండకాయల ధర 8.99 పౌండ్లు, అంటే సుమారు 919 రూపాయలు. ఆ ధర చూసి షాక్ తిన్న ఆ యువకుడు వెంటనే ఫొటో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. అందులో బెండకాయ, కోడిగుడ్లు, పచ్చిమిర్చి, టమాటా కూడా ఉన్నాయి. ఆ కూరగాయల ధర చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. ప్రస్తుతం నెట్టింట ఇది వైరల్ అవుతోంది.