- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- వీడియోలు
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Sharad pawar: మహారాష్ట్రలోనూ మణిపూర్ తరహా అల్లర్లు..శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోనూ మణిపూర్ తరహా అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా థానేలో జరిగిన సాంఘీక ఐక్యతా సదస్సులో ఆయన మాట్లాడారు. గతేడాది మే నుంచి జాతి ఘర్షణల్లో 200 మందికి పైగా మరణించిన మణిపూర్ విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని విమర్శించారు. ‘దేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి, బలోపేతం చేయడానికి, సామాజిక ఐక్యత అవసరం. కానీ దేశంలోని ప్రస్తుత పరిస్థితి ఆందోళనకరంగా ఉంది’ అని వ్యాఖ్యానించారు. సామాజిక ఐక్యతను పెంపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సమస్యల పరిష్కారానికి సమర్థవంతమైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని, సామాజిక సామరస్యాన్ని కాపాడుకోవడం తప్పనిసరి అని అన్నారు. దేశాభివృద్ధికి సామాజిక ఐక్యత తప్పనిసరి అని స్పష్టం చేశారు. అయితే శరద్ పవార్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ భవాన్ కులే స్పందించారు. శరద్ పవార్ నుంచి ఇటువంటి ప్రకటన వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని చెప్పారు.