సుప్రీంకోర్టు సంచలన తీర్పు: లైంగిక దాడి కేసులో ఓ వ్యక్తికి 30ఏళ్ల జైలు శిక్ష

by samatah |
సుప్రీంకోర్టు సంచలన తీర్పు: లైంగిక దాడి కేసులో ఓ వ్యక్తికి 30ఏళ్ల జైలు శిక్ష
X

దిశ, నేషనల్ బ్యూరో: ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి సుప్రీంకోర్టు 30ఏళ్ల జైలుశిక్ష విధించింది. నిందితుడి చర్య అనాగరికమని పేర్కొంది. వివరాల్లోకి వెళ్తే..మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి 2018లో బాలికను కిడ్నాప్ చేసి ఓ ఆలయానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక అమ్మమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో దోషిగా తేలడంతో నిందితుడికి ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించింది. అనంతరం దీనిని మధ్యప్రదేశ్ హైకోర్టులో సవాల్ చేయగా న్యాయస్థానం జీవిత ఖైదుగా మార్చింది. ఈ క్రమంలోనే నిందితుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా..న్యాయమూర్తులు సిటీ రవికుమార్, రాజేష్ బిందాల్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ ప్రస్తుత వయసు, ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవరించి, 30ఏళ్ల జైలుశిక్షగా మార్చింది. అంతేగాక నిందితుడికి రూ.లక్ష జరిమానా విధించింది. ఈ ఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించింది.

Advertisement

Next Story

Most Viewed