కొన ఊపిరి ఉన్నప్పుడే అభయపై లైంగిక దాడి..పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు

by srinivas |   ( Updated:2024-08-19 08:39:16.0  )
కొన ఊపిరి ఉన్నప్పుడే అభయపై లైంగిక దాడి..పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు
X

దిశ, వెబ్ డెస్క్: కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ అభయపై లైంగిక దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొన ఊపిరి ఉన్నప్పుడే అభయపై లైంగిక దాడి జరిగిందని పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. గొంతు నులిమడంతో ఉపిరాడక అభయ చనిపోయినట్లు తేలింది. ఒంటిపై మొత్తం 24 తీవ్రమైన గాయాలున్నట్లు స్పష్టమైంది. గొంతు ఎముకలు విరిగిపోయాయని, అభయ శరీరంపై కొరికిన గాట్లు, గోళ్లతో గీచిన గాయాలు ఉన్నాయని పోస్టుమార్టం రిపోర్టు తేల్చింది. ఆహారంలో మత్తుమందు కలిపారా లేదా అనేది ఫోరెన్సిక్ నివేదికలో తేలే అవకాశాలున్నాయని పోలీసులు అంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే నిందితుడిని అరెస్ట్ చేశారు. మరోవైపు దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైన అంశాలు సంచలనంగా మారాయి.

Advertisement

Next Story