- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండియా కూటమిపై బిహార్ సీఎం నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఇండియా కూటమిపై బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం బిహార్ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. తాను ఇండియా కూటమిలో ఉండటం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇండియా కూటమి అభివృద్ధి కోసం వ్యక్తిగతంగా చాలా కష్టపడ్డానని అన్నారు. దేశ వ్యాప్తంగా అనేక పార్టీల అధినేతలతో మాట్లాడానని తెలిపారు. విపక్షాలను ఏకం చేస్తుంటే నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు.. ఆ సమయంలో నా నాయకత్వం కాంగ్రెస్‌కు నచ్చలేదని చెప్పారు.
అంతకుముందు బిహార్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బలపరీక్షలో నెగ్గారు. తేజస్వి యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ సభ నుంచి వాకౌట్ చేసింది. దీంతో నితీశ్ సర్కారు 129తో బలపరీక్షలో గెలుపొందింది. బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు 122 మంది కావాల్సి ఉంది. నితీష్ కుమార్ కూటమికి 129 మంది సభ్యుల సపోర్ట్ రావడంతో ప్రభుత్వ ఏర్పాటు సులభం అయంది. మరోవైపు బిహార్ సీఎంగా నితీశ్ ఇప్పటివరకు మొత్తం తొమ్మిదోసార్లు ప్రమాణ స్వీకారం చేశారు.