- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: కర్నాటక నెక్ట్స్ సీఎం ఆయనే.. ఇవాళ సాయంత్రం అధికారిక ప్రకటన..!
దిశ, వెబ్‌డెస్క్: కర్నాటక సీఎం ఎంపికపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడినట్లు తెలుస్తోంది. కర్నాటక తదుపరి సీఎంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య వైపే అధిష్టానం మొగ్గు చూపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సిద్ధరామయ్య రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ ఇవాళ సాయంత్రం అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. కర్నాటకలో సిద్ధరామయ్య ఇంటి వద్ద పోలీసులు భారీగా భద్రత పెంచారు.
ఇక, ఈ నెల 10వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. సింగిల్‌గానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ సాధించిన కాంగ్రెస్‌కు సీఎం ఎంపిక తలనొప్పిగా మారింది. కర్నాటక సీఎం సీటు కోసం కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్య పోటీ పడటంతో హైకమాండ్ బరిలోకి దిగింది. గత నాలుగు రోజులుగా సీఎం ఎంపికపై కసరత్తు జరిపిన కాంగ్రెస్ అధిష్టానం.. చివరకు సీనియర్ నేత సిద్ధరామయ్య వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. దీంతో మరోసారి కర్నాటక సీఎంగా సిద్ధరామయ్య రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక, కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.