సీబీఐలో ఇద్దరు కొత్త అదనపు డైరెక్టర్లను నియమించిన కేంద్రం

by S Gopi |
సీబీఐలో ఇద్దరు కొత్త అదనపు డైరెక్టర్లను నియమించిన కేంద్రం
X

దిశ, నేషనల్ బ్యూరో: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లో కొత్త అదనపు డైరెక్టర్లను కేంద్రం నియమించింది. ఒకే బ్యాచ్‌కు చెందిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులైన ఏవైవీ కృష్ణ, ఎన్ వేణుగోపాల్‌లను నియమిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులిచ్చింది. అస్సాం-మేఘాలయ కేడర్‌కు చెందిన 1995-బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి కృష్ణ, ప్రస్తుతం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్)లో ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. సీబీఐ అదనపు డైరెక్టర్ బాధ్యతల్లో ఆయన 2028, ఆగష్టు 6 వరకు కొనసాగనున్నారు. ఇక, హిమాచల్‌ప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి వేణుగోపాల్, ప్రస్తుతం సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయన అదనపు డైరెక్టర్‌గా 2027, మే 24 వరకు ఉండనున్నట్టు సిబ్బంది మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.



Next Story