Semiconductor: డిజిటల్ యుగానికి సెమీకండక్టరే ఆధారం.. ప్రధాని నరేంద్ర మోడీ

by vinod kumar |
Semiconductor: డిజిటల్ యుగానికి సెమీకండక్టరే ఆధారం.. ప్రధాని నరేంద్ర మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: డిజిటల్ యుగానికి సెమీకండక్టరే ఆధారమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రాథమిక అవసరాలను తీర్చడానికి సెమీకండక్టర్ పరిశ్రమ ఉపయోగపడే రోజు ఎంతో దూరంలో లేదని తెలిపారు. ప్రజాస్వామ్యం, సాంకేతికత కలిసి మానవాళి సంక్షేమాన్ని నిర్ధారిస్తాయన్నారు. మోడీ నివాసంలో మంగళవారం సెమీకండక్టర్ ఎగ్జిక్యూటీవ్స్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భవిష్యత్ అంతా సాంకేతికతతోనే నడవబోతుందని చెప్పారు. సెమీకండక్టర్ రంగంలో విశ్వసనీయ భాగస్వామిగా మారడానికి భారత్‌కు అద్బుతమైన సామర్థ్యం ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా పోటీలో ఉన్న ఉత్పత్తులను అభివృద్ధి చేయడంపైనే భారత్ దృష్టి సారించిందని తెలిపారు. పెట్టుబడులు పెట్టడానికి భారత్ గొప్ప మార్కెట్ అని కొనియాడారు. సెమీకండక్టర్ సెక్టార్ ప్రతినిధులు పంచుకున్న అభిప్రాయాలు ఈ రంగం కోసం మరింత కష్టపడి పనిచేయడానికి ప్రభుత్వాన్ని ప్రేరేపిస్తుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed