Maha Vikas Aghadi : ‘ఎంవీఏ కూటమి’ సీట్ల సర్దుబాటు చర్చలు పూర్తి : సంజయ్ రౌత్

by Hajipasha |
ED Issues Notice To Sanjay Raut to attend questioning on Tuesday
X

దిశ, నేషనల్ బ్యూరో : త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ‘మహా వికాస్ అఘాడీ’ (ఎంవీఏ) కూటమిలో సీట్ల సర్దుబాటు చర్చలు కొలిక్కి వచ్చాయి. ఈవిషయాన్ని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ శుక్రవారం వెల్లడించారు. సీట్ల పంపకాలకు సంబంధించి కూటమిలోని పార్టీల మధ్య ఎలాంటి అభిప్రాయ బేధాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ‘‘మహారాష్ట్రలో ఉన్న రాజ్యాంగ వ్యతిరేక, అక్రమ ప్రభుత్వాన్ని ప్రజాస్వామిక పద్ధతిలో గద్దెదించాల్సిన అవసరం ఉంది’’ అని రౌత్ తెలిపారు.

ఇటీవలే శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ థాక్రే ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో భేటీ అయ్యారు. దీనిపై శివసేన షిండే వర్గం నేత సంజయ్ నిరుపమ్ విమర్శలు గుప్పించారు. ‘‘ఎంవీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. అయినా ఉద్ధవ్ తాపత్రయపడుతున్నారు. ఆ పార్టీలో అందరూ సీఎం పోస్టు కోసమే ప్రయత్నిస్తున్నారు. తానే సీఎం అభ్యర్థిగా ఉండాలని చెప్పేందుకే ఢిల్లీకి ఉద్ధవ్ వెళ్లి ఉంటారు’’ అని ఆయన విమర్శించారు.

Next Story

Most Viewed