క్షమాపణలు చెప్పారని నిరూపించాలి: రాహుల్‌కు సావర్కర్ మనవడి సవాల్

by Sathputhe Rajesh |
క్షమాపణలు చెప్పారని నిరూపించాలి: రాహుల్‌కు సావర్కర్ మనవడి సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: వీర్ సావర్కర్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కాంట్రవర్సీ అయిన విషయం తెలిసిందే. దీనిపై సావర్కర్ మనవడు రంజిత్ సావర్కర్ స్పందించారు. తన తాత గురించి తప్పుగా మాట్లాడటంపై ఫైర్ అయ్యారు. దేశ భక్తుడు, హిందుత్వ సిద్ధాంతకర్త అయిన సావర్కర్ ఎప్పుడు బ్రిటీష్ వారికి క్షమాపణలు చెప్పారో సాక్ష్యాధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు. దానికి సంబంధించి ఏమైనా పత్రాలు ఉంటే చూపించాలన్నారు.

రాహుల్ వ్యాఖ్యలు పిల్లల మాటల్లా ఉన్నాయని మండిపడ్డారు. రాజకీయ ప్రచారం కోసం దేశభక్తుల పేర్లను వాడుకోవడం తప్పన్నారు. ఇది చాలా పెద్ద నేరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు గానూ రాహుల్ పై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఇటీవల తన అనర్హత వేటుపై ఇటీవల మీడియాతో మాట్లాడిన రాహుల్ సావర్కర్ పేరును ప్రస్తావిస్తూ నేను సావర్కర్ కాను.. గాంధీని.. గాంధీలు క్షమాపణలు చెప్పరు అని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story