- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతీది రాజకీయమే: సంజయ్ రౌత్
ముంబై: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపై శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం భారత్, ఆస్ట్రేలియా మధ్య ప్రపంచ కప్ మ్యాచ్ జరుగుతున్న వేళ, దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి అంశం, కార్యక్రమం రాజకీయంగా మారిందన్నారు. నరేంద్ర మోడీ బౌలింగ్, అమిత్ షా బ్యాటింగ్ చేస్తున్నట్టు, మిగిలిన బీజేపీ నేతలు బౌండరీ వద్ద ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఆఖరికి ప్రధాని మోడీ ఉన్నందువల్లే మనం ప్రపంచకప్ గెలిచామని, క్రెడిట్ మొత్తం వారి ఖాతాలో వేసుకుంటారని ఎద్దేవా చేశారు. 'క్రికెట్‌లోకి రాజకీయాలు తీసుకురావాల్సిన అవసరం లేదు. కానీ అహ్మదాబాద్‌లో అదే జరుగుతోందని సంజయ్ రౌత్ అన్నారు. కేంద్రంలోనూ, వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి దేశంలో అంతా రాజకీయమయమైంది. అది ఎవరి మరణమైనా, క్రీడా పోటీలైనా అంతా రాజకీయంగా మారిందని రౌత్ విమర్శించారు.