Sandip gosh: ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్‌కు భారీగా స్థిరాస్తులు.. ఈడీ తనిఖీల్లో డాక్యుమెంట్స్ లభ్యం!

by vinod kumar |
Sandip gosh: ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్‌కు భారీగా స్థిరాస్తులు.. ఈడీ తనిఖీల్లో డాక్యుమెంట్స్ లభ్యం!
X

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ భార్య పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ అధికారుల నుంచి సరైన అనుమతి లేకుండా రెండు స్థిరాస్తులను కొనుగోలు చేశారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తెలిపింది. ఆర్థిక అవకతవకల కేసుకు సంబంధించి సందీప్, అతని బంధువుల నివాసాల్లో ఈ నెల 6న నిర్వహించిన దాడుల వివరాలను ఈడీ మంగళవారం వెల్లడించింది. సోదాల్లో దాదాపు అరడజను ఇళ్లు, ఫ్లాట్లు, ఫామ్‌హౌస్‌కు సంబంధించిన పత్రాలు లభ్యమయ్యాయని తెలిపింది. ముర్షిదాబాద్‌లోని ఒక ఫ్లాట్, కోల్‌కతాలోని మూడు ఫ్లాట్లు సహా ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ దొరికినట్టు పేర్కొంది. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ను పరిగణనలోకి తీసుకున్న అనంతరం సందీప్ ఘోష్‌పై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే ఈనెల 2న ఆయనను అరెస్టు చేసింది. కళాశాల, ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలపై ఈడీ విచారిస్తోంది.

Advertisement

Next Story