- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సైఫ్ అలీఖాన్ బ్లడ్ శాంపిల్స్ సేకరించిన పోలీసులు.. కారణం ఇదే!

దిశ,వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటుడు(Bollywood) సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan)పై ఇటీవల(జనవరి 16) ఓ దుండగుడు దాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే దాడికి పాల్పడిన దుండగుడు షరిపుల్ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపడుతున్నారు. ఈ దాడి కేసులో విచారణను ముంబయి పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఇప్పటికే నటుడు సైఫ్ అలీఖాన్ వాంగ్మూలాన్ని పోలీసులు తీసుకున్నారు.
ఇక తాజాగా సైఫ్ బ్లడ్ శాంపిల్స్ (blood samples)ను, ఘటన సమయంలో సైఫ్ ధరించిన దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. నేరం జరిగిన రోజు నిందితుడు ధరించిన దుస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి దుస్తులపై రక్తపు మరకలు ఉన్నాయని, అవి సైఫ్‌వేనా కాదా అని తెలుసుకునేందుకు పోలీసులు శాంపిల్స్‌ను కలెక్ట్ చేసినట్లు సమాచారం. సైఫ్ దుస్తులు, రక్త నమూనాలతోపాటు నిందితుడి దుస్తులను ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపించినట్లు పోలీసులు తెలిపారు.