Video Viral: నిద్రిపోతున్న యువరాజ్‌కు సడెన్‌ సర్‌ప్రైజ్ ఇచ్చిన సచిన్

by srinivas |   ( Updated:2025-03-14 15:15:48.0  )
Video Viral: నిద్రిపోతున్న యువరాజ్‌కు సడెన్‌  సర్‌ప్రైజ్ ఇచ్చిన సచిన్
X

దిశ, వెబ్ డెస్క్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(Master Blaster Sachin Tendulkar) హోలీ వేడుకల్లో(Holi celebration) సందడి చేశారు. చిన్నపిల్లవాడి మారి హంగామా చేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్‌(Raipur)లో టీమిండియా(Team India) సీనియర్ ఆటగాళ్లు రాయ్‌పూర్‌లో ఐఎంఎల్ 2025 ఇంటర్నేషన్ లీగ్ మ్యాచ్‌(IML 2025 International League Match)లు ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే గురువారం ఆస్త్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్‌లో యువరాజ్ ఆట గెలుపునకు కారణం అయింది. ఈ గెలుపుతో భారత్ ఫైనల్లోకి దూసుకుపోయింది. ఫైనల్‌కు సమయం ఉండటంతో ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుంటున్నారు. రాయ్‌పూర్‌లోనే బస చేశారు. యువరాజ్ సింగ్ ఓ రూమ్‌లో రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సడెన్ సర్‌ప్రైజ్ చేశారు.


హోలీ సందర్భంగా టీమిండియా క్రికెటర్లకు రంగులు పూసి సచిన్ సందడి చేశారు. అటు యువరాజ్ సింగ్ నిద్రపోతున్న రూమ్ వద్దకు సైతం వెళ్లారు. కాలింగ్ బిల్లు నొక్కి హౌస్ కిపింగ్ వచ్చామంటూ చెప్పారు. దీంతో యువరాజ్ సింగ్(Yuvraj Singh) తలుపు తీయడంతో సచిన్ టెండూల్కర్‌తో పాటు పలువురు టీమిండియా ఆటగాళ్లు ఒక్కసారిగా వాటర్ గన్లలతో రంగులు పోశారు. హ్యాపీ హోలీ అంటూ సర్ ప్రైజ్ చేశారు. దీంతో యువరాజ్ రంగుల్లో మునిగిపోయారు. మీ టూ అంటూ వారికి కూడా యూవీ సైతం విషెస్ చెప్పారు. టీమిండియా క్రికెటర్లకు రంగు పోసి హోలీ ఆడిన వీడియోను సచిన్ ఎక్స్‌లో పోస్టు చేశారు. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. సచిన్‌తో పాటు టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story