RG Kar case: ఆర్జీ కర్ కేసు.. సీబీఐ అప్పీల్ అంగీకరించిన కలకత్తా హైకోర్టు

by Shamantha N |
RG Kar case: ఆర్జీ కర్ కేసు.. సీబీఐ అప్పీల్ అంగీకరించిన కలకత్తా హైకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆర్జీకర్‌ హత్యాచారం (Kolkata Doctor Murder Case) కేసులో ట్రయర్ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పశ్చిమబెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను కలకత్తా హైకోర్టు(High Court) కొట్టివేసింది. ప్రభుత్వం చేసిన ఈ ప్రత్యేక అప్పీల్‌ను స్వీకరించేందుకు హైకోర్టు నిరాకరించింది. అయితే, ఇదే తీర్పును సవాలు చేస్తూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దాఖలు చేసిన పిటిషన్ ను అంగీకరించింది. మరోవైపు.. హత్యాచారం కేసు మరోసారి విచారణ కోరుతూ మృతురాలి తల్లిదండ్రులు వేసిన అత్యవసర విచారణ పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) నిరాకరించింది.

ట్రైనీ డాక్టర్ పై హత్యాచారం

గతేడాది ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆర్జీకర్‌ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ పై హత్యాచారం జరగిన ఘటన కలకలం రేపింది. అయితే, ఈ కేసుపై కోల్‌కతాలోని సీల్దా కోర్టు నిందితుడు సంజయ్‌రాయ్‌ (Sanjay Roy)ని దోషిగా తేలుస్తూ జీవితఖైదు విధించింది. అలాగే బాధిత కుటుంబానికి రూ.17 లక్షల పరిహారం చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా.. దీనిపై బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) అసంతృప్తి వ్యక్తంచేశారు. దోషికి మరణశిక్ష విధించాలని డిమాండ్‌ చేస్తూ దీదీ సర్కారు కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ కేసుపై జోక్యం చేసుకునే అధికారం బెంగాల్ ప్రభుత్వానికి లేదని సీబీఐ పేర్కొంది. కేసుని విచారించిన సంస్థగా శిక్ష విషయంలో కోర్టుని ఆశ్రయించే హక్కు తమకే ఉంటుందని.. సీబీఐ హైకోర్టుని ఆశ్రయించింది.



Next Story

Most Viewed