- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆ కొరియోగ్రాఫర్‌తో క్లోజ్‌గా దిగిన ఫొటోస్ షేర్ చేసి అనసూయ.. ఓ ఆట ఆడుకుంటున్న నెటిజన్లు

దిశ, వెబ్‌డెస్క్: జబర్దస్త్ షో(Jabardasth Show)కి యాంకరింగ్ చేసి నేడు సినిమాల్లో కీ రోల్ ప్లే చేసే స్థాయికి ఎదిగిన యాంకర్ అనసూయ(Anasuya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన యాంకరింగ్‌తో ఫుల్ ఫేమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీకి సుకుమార్(Sukumar) డైరెక్షన్‌లో రామ్ చరణ్(Ram Charan) హీరోగా నటించిన ‘రంగస్థలం’(rangasthalam) సినిమాలో రంగమ్మత్తగా నటించే చాన్స్ లభించింది. ఆ మూవీతో ఈ అమ్మడు గ్రాఫ్ ఒక్కసారిగా చేంజ్ అయింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది.
అలా ఓ పక్కా సినిమాలతో మరో పక్క షోలతో ఫుల్ బిజీ బిజీగా ఉంటుంది. అయితే ప్రస్తుతం స్టార్ మా లో శ్రీముఖి యాంకర్‌గా స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, అనసూయ జడ్జులుగా వ్యవహరిస్తున్న షో ‘కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ లేడీస్’. ఇందులో కంటెస్టెంట్స్ కంటే వీరిద్దరికే ఎక్కువ పోటీ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
తాజాగా అనసూయ తన ఇన్‌స్టా వేదికగా శేఖర్ మాస్టర్‌తో చాలా క్లోజ్‌గా ఉన్న ఫొటోస్ షేర్ చేస్తూ.. ‘మనమందరం స్వీట్, స్పైస్‌లా కలిసి ఉండవచ్చు.. కానీ కొన్ని సార్లు అలా ఉండకపోవచ్చు’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారగా.. దీన్నిచూసిన నెటిజన్లు భర్త ఉండగా ఇలా వేరే వాళ్లతో క్లోజ్‌గా మూవ్ అవ్వడానికి సిగ్గు ఉండాలని, వీరిద్దరి మధ్య ఏదో లింక్ ఉందని, క్యూట్ కపుల్ ఇక మీరిద్దరూ పెళ్లి చేసుకోండని తమకు నచ్చిన కామెంట్స్ పెడుతూ ఓ ఆట ఆడుకుంటున్నారు.