- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోడీకి చిన్న రిక్వెస్ట్.. ఆస్కార్ క్రెడిట్‌ను తీసుకోవద్దు
న్యూఢిల్లీ: తాజాగా భారతీయ చిత్రాలకు రెండింటికి ఆస్కార్ అవార్డులు రావడంపై రాజ్యసభ విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే ప్రధాని మోడీపై సెటైర్లు వేశారు. ఈ ఆస్కార్ క్రెడిట్ ను తీసుకోవద్దని ఆయనకు రిక్వెస్ట్ చేశారు. కథ మేమే రాశాం.. మేమే డైరెక్ట్ చేశామని చెప్పుకోవద్దని మంగళవారం రాజ్యసభలో సెటైర్లు వేశారు. దీంతో కాస్తా రాజ్యసభలో నవ్వులు విరిశాయి. భారతీయ చిత్రాలు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులు గెలుచుకోవడం గర్వంగా ఉందని ఖర్గే అన్నారు. అయితే ఈ ఘనతను అధికార పార్టీ తమ క్రెడిట్ గా చెప్పుకోవద్దని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఇది తన విజ్ఞప్తి అని చెప్పారు. ఈ వ్యాఖ్యల సమయంలో రాజ్యసభ చెర్మైన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, రాజ్యసభ లీడర్ పియూష్ గోయల్, కేంద్ర మంత్రులు మన్సూఖ్ మాండవీయా, భూపేంద్ర యాదవ్ నవ్వుతూ కనిపించారు. అంతకుముందు రాజ్యసభ నామినేషన్లలో ప్రధాన మంత్రి కార్యాలయానికి ఆస్కార్ వచ్చిందని ఆర్ఆర్ఆర్ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్‌ను ప్రస్తావిస్తూ పియూష్ గోయల్ పోస్ట్ చేశారు. అయితే దీనిపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. విజయేంద్ర ప్రసాద్‌ను గతేడాది ప్రధాని మోడీ రాజ్యసభకు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.