- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పన్నూ హత్యకు కుట్ర.. ‘రా’ పాత్రపై సంచలన నివేదిక
దిశ, నేషనల్ బ్యూరో : అమెరికాలో ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర వ్యవహారంపై ‘వాషింగ్టన్ పోస్ట్’ సంచలన కథనాన్ని ప్రచురించింది. 2022 నవంబరులో పన్నూను హత్య చేయడానికి అవసరమైన టీమ్‌ను భారత నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) అధికారి విక్రమ్ యాదవ్ నియమించుకున్నాడని కథనంలో ప్రస్తావించింది. మర్డర్ కోసం నియమించుకున్న కిరాయి హంతకులకు విక్రమ్ యాదవ్ తన న్యూయార్క్ చిరునామాతో పాటు పన్నూకు సంబంధించిన వివరాలను అందించాడని తెలిపింది. ప్రస్తుతం విక్రమ్ యాదవ్‌కు భారత ప్రభుత్వానికి చెందిన మరో సంస్థలోకి మారిపోయి పనిచేస్తున్నాడని కథనం పేర్కొంది. విక్రమ్ యాదవ్‌ను రా సంస్థ సీసీ-1 అనే కోడ్ నేమ్‌తో పిలిచేదని వెల్లడించింది. తమ కథనంపై స్పందించడానికి భారత విదేశాంగ శాఖ నిరాకరించిందని ‘వాషింగ్టన్ పోస్ట్’ తెలిపింది. పన్నూ హత్యకు కుట్ర ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు భారత ప్రభుత్వం 2023 నవంబర్ 18న ఉన్నత స్థాయి విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.