Ravi Shankar Prasad: కాంగ్రెస్ పెన్షన్ హామీ ఏమైంది?.. బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్

by vinod kumar |
Ravi Shankar Prasad: కాంగ్రెస్ పెన్షన్ హామీ ఏమైంది?.. బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్
X

దిశ, నేషనల్ బ్యూరో: యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్(యూపీఎస్)ను అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ..బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత యూటర్న్ తీసుకుంటుందని, యూపీఎస్‌లో ‘యూ’ అంటే యూనిఫైడ్ కాదని ‘యూటర్న్’ అని వ్యాఖ్యానించారు. ఈ విమర్శలపై బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. కాంగ్రెస్ తన ఎన్నికల హామీలను, ముఖ్యంగా పెన్షన్ హామీని ఎప్పుడు నెరవేరుస్తుందని ప్రశ్నించారు. హిమాచల్ ప్రదేశ్‌లో రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్లుగా పాత పెన్షన్ పథకాన్ని అమలు చేశారా అని నిలదీశారు. దీనిని ఎప్పుడు నెరవేరుస్తారో సమాధానం చెప్పాలన్నారు. రాహుల్ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని ఫైర్ అయ్యారు. ‘భారత్‌ను పరిపాలించడం అనేది ఒక క్లిష్టమైన పని. కాంగ్రెస్ పార్టీ కేవలం ఓట్లు రాబట్టు కోవడానికి మాత్రమే ప్రకటనలు చేస్తుంది. ఆ పార్టీ నిర్ణయాలపై ప్రజలకు నమ్మకం పోయింది’ అని ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed