Haryana Polls : 40 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ మూడో లిస్ట్.. సూర్జేవాలా కుమారుడికి టికెట్

by Hajipasha |
Haryana Polls : 40 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ మూడో లిస్ట్.. సూర్జేవాలా కుమారుడికి టికెట్
X

దిశ, నేషనల్ బ్యూరో : హర్యానా అసెంబ్లీ ఎన్నికల కోసం 40 మంది అభ్యర్థుల పేర్లతో మూడో జాబితాను కాంగ్రెస్ పార్టీ బుధవారం రాత్రి విడుదల చేసింది. ఈ జాబితాలో కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలా కుమారుడు ఆదిత్య సూర్జేవాలా పేరు కూడా ఉంది. ఆయనకు కైథాల్ అసెంబ్లీ సీటును కేటాయించారు.

రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ సీట్లు ఉండగా.. ఇప్పటివరకు మూడు జాబితాల్లో 81 స్థానాలకు అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అనౌన్స్ చేసింది. అయితే 8 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఇంకా ప్రకటించలేదు. ఒకవేళ పొత్తు కుదిరితే.. వాటిని ఆప్‌కు కేటాయించాలని హస్తం పార్టీ భావిస్తోందని అంటున్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అక్టోబరు 5న, ఓట్ల లెక్కింపు అక్టోబరు 8న జరగనుంది.

Advertisement

Next Story

Most Viewed