‘జమిలి’పై రాష్ట్రపతికి కోవింద్‌ కమిటీ నివేదిక.. డేట్ ఫిక్స్ !

by Hajipasha |
‘జమిలి’పై రాష్ట్రపతికి కోవింద్‌ కమిటీ నివేదిక.. డేట్ ఫిక్స్ !
X

దిశ, నేషనల్ బ్యూరో : మన దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ అధ్యయనం పూర్తయింది. ఈ కమిటీ తుది నివేదికను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు గురువారం అందజేసే అవకాశం ఉంది. జమిలి ఎన్నికలను నిర్వహించాలంటే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని కొన్ని నిబంధనలతో పాటు రాజ్యాంగంలోని కనీసం ఐదు అధికరణలను సవరించాలని కోవింద్‌ కమిటీ సిఫార్సు చేయనున్నట్లు సమాచారం. 2029 సంవత్సరం నాటికి దేశంలో లోక్‌సభ, అసెంబ్లీలు, స్థానిక సంస్థల ఎన్నికలను ఒకేసారి నిర్వహించవచ్చని కమిటీ సూచించనుందని తెలుస్తోంది. ఈ మూడు రకాల ఎన్నికలకు ఒకే ఓటర్ల జాబితాను రూపొందించాలని కూడా కమిటీ సిఫార్సు చేయనుందట. కాగా, రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, రాజ్యసభలో మాజీ విపక్ష నేత గులాం నబీ ఆజాద్‌, ఫైనాన్స్‌ కమిషన్ మాజీ ఛైర్మన్‌ ఎన్‌కే సింగ్‌, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్‌ సుభాష్‌ కశ్యప్‌, సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే ఉన్నారు. లోక్‌సభలో కాంగ్రెస్‌ సభాపక్షనేత అధీర్‌ రంజన్‌ ఛౌదరిని కూడా సభ్యునిగా పేర్కొన్నప్పటికీ.. అందుకు ఆయన నిరాకరించారు. న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ ఈ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed