- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సభ పేరుతో విధ్వంసమా.. అధికారులపై ఎమ్మెల్యే ఫైర్

దిశ, ఎల్కతుర్తి: బీఆర్ఎస్ రజతోత్సవ సభ పేరుతో కాలువలను పూడుస్తూ, పంట పొలాల గెట్లను తొలగిస్తే అధికారులు ఏం చేస్తున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్కతుర్తి పెద్దవాగు, దేవాదుల కెనాల్ ను కాంగ్రెస్ ఎల్కతుర్తి మండల పార్టీ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు సోమవారం ఆయన పరిశీలించారు. అధికారులు కళ్ళు మూసుకుని పని చేస్తున్నారా అని అసహనం వ్యక్తం చేశారు. వేలాది ట్రిప్పుల మొరాన్ని ఎవరి అనుమతితో ఇక్కడికి తెస్తున్నారని ప్రశ్నించారు. కలెక్టర్ ప్రావీణ్య, ఆర్డీవో రాథోడ్ రమేష్, మైనింగ్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఈ నిర్వాకానికి బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి, బొమ్మనపల్లి అశోక్ రెడ్డి, సంతాజి, గోలి రాజేశ్వరరావు, గూడెల్లి నవీన్ కుమార్, అంబాల శ్రీకాంత్ (బక్కి), అర్జున్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.