Sharad Pawarఛ మరోసారి ఒకే వేదికను పంచుకున్న పవార్ బ్రదర్స్

by Shamantha N |
Sharad Pawarఛ మరోసారి ఒకే వేదికను పంచుకున్న పవార్ బ్రదర్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్(Ajit Pawar), ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌ పవార్(Sharad Pawar) మరోసారి ఒకే వేదికను పంచుకున్నారు. గత పదిహేను రోజుల్లో వారిద్దరూ కలిసి ఒకే వేదికపై కనిపించడం ఇది మూడోసారి. సోమవారం పూణేలోని సఖర్ సంకుల్ (షుగర్ కాంప్లెక్స్)లో జరిగిన సమావేశంలో శరద్‌ పవార్‌, అజిత్‌ పవార్‌ ఒకే వేదికను పంచుకున్నారు. వసంతదాదా షుగర్ ఇన్‌స్టిట్యూట్ అధికారులు కూడా హాజరయ్యారు. కాగా, ఈ సమావేశం తర్వాత అజిత్ పవార్ మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడానికి, భూసారాన్ని మెరుగుపరచడానికి, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడానికి ఏఐని ఉపయోగించడం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.

రెండు వారాల్లో..

మరోవైపు శరద్‌ పవార్‌, అజిత్‌ పవార్‌ తిరిగి దగ్గరవుతున్నట్లుగా గత కొన్ని నెలలుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు వారాల్లో మూడోసారి శరద్‌ పవార్‌తో వేదిక పంచుకోవడం గురించి అజిత్‌ పవార్‌ను మీడియా ప్రశ్నించింది. ఫ్యామిలీ గ్యాదరింగ్స్ లో సమావేశమవుతున్నాయమని.. దీన్ని వేరేగా రాజకీయ కోణంలో దీనిని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. తన కుమారుడు జై నిశ్చితార్థం తర్వాత మరో కార్యక్రమంలో తామిద్దరం కలిసినట్లు చెప్పారు. ఈ సమావేశాలకు రాజకీయ ప్రాముఖ్యత లేదని అన్నారు. కొన్ని అంశాలు రాజకీయాలకు అతీతంగా ఉంటాయని అజిత్ అన్నారు.


Next Story

Most Viewed