బీజేపీ ఎప్పటికీ రాజ్యాంగాన్ని మార్చదు: రాజ్‌నాథ్ సింగ్

by Disha Web Desk 17 |
బీజేపీ ఎప్పటికీ రాజ్యాంగాన్ని మార్చదు: రాజ్‌నాథ్ సింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ రాజ్యాంగాన్ని మార్చదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ప్రముఖ మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేస్తుంది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ విధంగా కల్పిత వార్తలను సృష్టిస్తుంది. బీజేపీకి రాజ్యాంగాన్ని మర్చే ఆలోచన లేదని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

కాంగ్రెస్ 80 సార్లు రాజ్యాంగ సవరణలు తెచ్చింది. వారు ఎమర్జెన్సీ సమయంలో పీఠికను మార్చారు. రాజ్యాంగ నిర్మాతలు పీఠికలో మార్పులు వస్తాయని ఊహించలేదు. కానీ కాంగ్రెస్ రాజ్యాంగంలోని ప్రధాన ఆలోచనను దెబ్బతీసేలా వ్యవహరించింది. వారు ప్రజల్లో భయాన్ని కలిగించడం ద్వారా వారి మద్దతు పొందడానికి ప్రయత్నిస్తున్నారు. భయాందోళనలు కలిగించకుండా, విశ్వాసం కల్పించడం ద్వారా ప్రజల మద్దతు పొందడానికి ప్రయత్నించాలని సూచిస్తున్నాను. ఎన్నికల ప్రచారాలు వాస్తవాలపై ఆధారపడి ఉండాలని రక్షణ మంత్రి అన్నారు.

రిజర్వేషన్ల విషయంలోనూ కాంగ్రెస్ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందని రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉంటే రాజ్యాంగాన్ని చించి విసిరివేస్తుందని, రాజ్యాంగ పీఠిక నుండి "లౌకికవాదం" అనే పదాన్ని తొలగిస్తుందని ఆరోపిస్తుండగా, రాజ్‌నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిత-కశ్మీర్‌పై మాట్లాడిన ఆయన పీఓకేపై ఉన్న హక్కును ఎప్పటికీ వదులుకోమని, అయితే దానిని బలవంతంగా స్వాధీనం చేసుకోవలసిన అవసరం లేదని రాజ్‌నాథ్ అన్నారు, ఎందుకంటే దేశ అభివృద్ధిని చూసిన తర్వాత దాని ప్రజలు తమంతట తాముగా భారతదేశంలో భాగం కావాలని కోరుకుంటారని రక్షణ మంత్రి తెలిపారు.

Next Story

Most Viewed