- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశవ్యాప్తంగా నిలిచిపోనున్న రైల్వే సేవలు!
దిశ, నేషనల్ బ్యూరో: తమకు పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) అమలు చేయాలని రైల్వే ఉద్యోగులు, కార్మికులు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్‌ను వీలైనంత త్వరగా అమలు చేయాలని, లేదంటే, మే 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా రైల్వే సేవలను నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు రైల్వే ఉద్యోగులు, కార్మికులకు చెందిన పలు యూనియన్లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘జాయింట్ ఫోరమ్ ఫర్ రిస్టోరేషన్ ఆఫ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్’(జేఎఫ్ఆర్వోపీఎస్) గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘కొత్త పెన్షన్ పథకం స్థానంలో పాత పెన్షన్ స్కీంను పునరుద్ధరించాలన్న మా డిమాండ్‌కు ప్రభుత్వం కట్టుబడి లేదు. ఇప్పుడు మాకు ప్రత్యక్ష చర్య తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు’’ అని జేఎఫ్ఆర్వోపీఎస్ కన్వినర్, అఖిల భారత రైల్వే ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి శివ్ గోపాల్ మిశ్రా వెల్లడించారు. అందుకే, కార్మిక దినోత్సవం(మే 1) నాడు దేశవ్యాప్తంగా సమ్మె, రైల్వే సేవలను నిలిపివేయనున్నామని ఈ నెల 19న రైల్వే మంత్రిత్వశాఖకు అధికారికంగా నోటీసులు అందజేస్తామని తెలిపారు.