ఎన్నికల ఓటమిని రాహుల్ గాంధీ స్వీకరించలేకపోతున్నారు : కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్

by Vinod kumar |
ఎన్నికల ఓటమిని రాహుల్ గాంధీ స్వీకరించలేకపోతున్నారు : కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
X

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ పై విరుచుకు పడ్డారు. ఎన్నికల ఓటమిని రాహుల్ గాంధీ స్వీకరించలేకపోతున్నారని విమర్శించారు. రాహుల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ల నిఘాలో ఉన్నట్లు పేర్కొంటూ, వరుస ఎన్నికల పరాజయాలను ఎదుర్కొన్న తర్వాత విదేశీ గడ్డపై భారతదేశాన్ని అపకీర్తి పాలు చేశారని కేంద్ర మంత్రి ఆరోపించారు. పెగాసెస్ అంశంలో సాంకేతిక కమిటీ కి ఫోన్లు ఇవ్వడంలో రాహుల్ తో పాటు ఇతరులను ఎవరు అడ్డుకున్నారని ప్రశ్నించారు.

కేంబ్రిడ్జి యూనివర్సిటీ లో రాహుల్ మాట్లాడుతూ.. పలువురు రాజకీయ నేతల దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని అన్నారు. అంతేకాకుండా ఇజ్రాయిల్ స్పైవేర్ పెగాసెస్‌ను తనపై ప్రయోగించారని ఆరోపించారు. ఆయనకు ప్రధాని అంటే విద్వేషం ఉందని అర్ధమవుతుంది. అయితే విదేశీ గడ్డపై భారత్‌ను అపకీర్తి పాలు చేసి ఫారిన్ స్నేహితులను నుంచి సహాయం కోరుతున్నారు’ అని ఠాకూర్ అన్నారు. ఇలాంటి చర్యలు వారి దివాళకోరుతనాన్ని ప్రతిబింబిస్తున్నాయని చెప్పారు. అయితే ఇటలీ ప్రధాని జార్జియా మెలోని చెప్పిన వ్యాఖ్యలు రాహుల్ విని ఉండాల్సిందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed