రాహుల్ గాంధీకి అమేఠీ నుంచి పోటీ చేసే ధైర్యం లేదు: రాజ్‌నాథ్ సింగ్

by Disha Web Desk 17 |
రాహుల్ గాంధీకి అమేఠీ నుంచి పోటీ చేసే ధైర్యం లేదు: రాజ్‌నాథ్ సింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2019లో అమేఠీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలైన తర్వాత తిరిగి అక్కడి నుంచి పోటీ చేసే ధైర్యం తనకు లేదని రాజ్‌నాథ్ సింగ్ గురువారం రాహుల్‌ గాంధీపై మండిపడ్డారు. ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి కేరళకు వలస వెళ్లారని ఘాటుగా వ్యాఖ్యానించారు. గురువారం బీజేపీ అభ్యర్థి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్‌ ఆంటోనీ తరఫున పతనమతిట్ట లోక్‌సభ నియోజకవర్గంలో రాజ్‌నాథ్‌సింగ్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రాహుల్ ఈసారి వాయనాడ్ నుంచి గెలవరని, ఇక్కడి ప్రజలు ఆయనను తమ ఎంపీగా చేయకూడదని నిర్ణయించుకున్నారని, ఇది విన్నానని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. దేశంలో వివిధ అంతరిక్ష కార్యక్రమాలు, ప్రాజెక్టులు లాంచ్ అవుతున్నాయి, కానీ "కాంగ్రెస్ యువ నాయకుడిని లాంచ్ చేయడం గత 20 సంవత్సరాలుగా జరగలేదు" అని అన్నారు. తన ప్రసంగంలో రాజ్‌నాథ్ సింగ్ కాంగ్రెస్ దిగ్గజం ఏకె ఆంటోనీని ప్రశంసించారు, అతని నిజాయితీ, చిత్తశుద్ధిని ప్రశ్నించలేని క్రమశిక్షణ, సూత్రప్రాయ వ్యక్తి అని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అతిని కుమారుడు అనిల్‌ ఆంటోనీకి మద్దతు ఇవ్వడం చాలా కష్టం అది మాకు తెలుసు, అయితే, అనిల్ మీ కొడుకు, మీరు అతని తండ్రి కాబట్టి మీ ఆశీస్సులు అతనికి ఉండాలని నేను అభ్యర్థిస్తున్నానని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

Next Story