- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rahul gandhi: చాంపియన్స్ మైదానంలోనే సమాధానమిచ్చారు.. వినేష్ ఫొగట్‌కు రాహుల్ అభినందన
దిశ, నేషనల్ బ్యూరో: పారిస్ ఒలంపిక్స్‌లో ఫైనల్స్‌లోకి అడుగుపెట్టిన మహిళా రెజ్లర్ వినేష్ ఫొగట్‌ను లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అభినందించారు. ఇది భారత్‌కు ఎంతో భావోద్వేగ క్షణమని తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘ఒకే రోజులో ప్రపంచంలోని ముగ్గురు అత్యుత్తమ రెజ్లర్లను ఓడించినందుకు వినేష్‌తో పాటు దేశం మొత్తం ఉద్వేగానికి లోనైంది. వినేష్, ఆమె సహచరుల పోరాటాన్ని తిరస్కరించిన వారందరూ, వారి ఉద్దేశాలు సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తారు’ అని పేర్కొన్నారు. ఇది చాంపియన్లకు ఎంతో గర్వకారణమని, వారిని విమర్శించిన వారికి మైదానంలోనే తగిన సమాధానం ఇచ్చారని వెల్లడించారు. ఆమె రక్తపు కన్నీళ్లు కార్చడానికి కారణమైన అధికార వ్యవస్థ మొత్తం ప్రస్తుతం కుప్ప కూలిందని విమర్శించారు. ప్యారిస్‌లో ఫొగట్ సాధించిన విజయాల ప్రతిధ్వని ఢిల్లీలో స్పష్టంగా వినిపిస్తోందని తెలిపారు. ఫైనల్‌లోనూ రాణించి స్వర్ణ పథకం గెలవాలని ఆకాంక్షించారు.