- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
Prashant Bhushan: ఆప్ పతనం ప్రారంభమైంది.. ప్రశాంత్ భూషణ్ తీవ్ర విమర్శలు

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (Aap) ఓడిపోవడంపై ఆ పార్టీ మాజీ నేత, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ (Prashanth Bhushan) స్పందించారు. తాజా ఓటమితో ఆప్ పతనానికి నాంది పడిందని తెలిపారు. ఘోర పరాజయానికి ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాలే (Aravindh Kejriwal) కారణమని, దీనికి ఆయనే బాధ్యత వహించాలని మండిపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీని దాని వ్యవస్థాపక సూత్రాల నుంచి దూరం చేసి అవినీతి సంస్థగా మార్చారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. పారదర్శకత, జవాబుదారీతనాన్ని కేజ్రీవాల్ విడిచిపెట్టారని పేర్కొన్నారు. ‘ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం ఆప్ ఏర్పడింది. కానీ పారదర్శకంగా, జవాబుదారీగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాల్సిన పార్టీని కేజ్రీవాల్ కరప్షన్ సంస్థగా మార్చారు’ అని పేర్కొన్నారు.
‘కేజ్రీవాల్ ఆయన కోసం రూ. 45 కోట్లతో శీష్‌మహల్ నిర్మించుకున్నారు. లగ్జరీ కార్లలో ప్రయాణించడం ప్రారంభించాడు. ఆప్ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీల 33 వివరణాత్మక విధాన నివేదికలను ఆయన పట్టించుకోలేదు. సమయం వచ్చినప్పుడు పార్టీ తగిన విధానాలను అవలంబిస్తుందని చెప్పారు’ అని తెలిపారు. పాలన కంటే ప్రచారంపైనే కేజ్రీవాల్ ఫోకస్ పెట్టారని, ఇది ఆప్ ముగింపునకు ప్రారంభం అని పేర్కొన్నారు. కాగా, 2015లో ఆప్ నుంచి ప్రశాంత్ భూషణ్‌ను బహిష్కరించారు. మరోవైపు కేజ్రీవాల్ ఓటమిపై అన్నాహజారే (Anna hajare) సైతం స్పందించారు. ప్రజా సేవ కంటే డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఆప్ తన విలువను కోల్పోయిందని, అదే పార్టీ విశ్వసనీయతను దెబ్బతీసిందని విమర్శించారు.